సీఎం జగన్ ను కలిసిన దెందులూరు ఎమ్మెల్యే


 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో "జగనన్న విద్యా దీవెన" కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు పూల బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు అంశాలను సీఎం దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు.