చంద్రగిరిలో అంగన్వాడీ సిబ్బంది నిర్వహిస్తున్న సమ్మెకు జనసేన పార్టీ మద్దతు పలికింది. నిరసన వహిస్తున్న వారితో కలిసి చంద్రగిరి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దేవర మనోహర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. వారి న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన కోరారు.