వైసీపీ సీనియర్ నాయకులు ఎం. వి. రత్నారెడ్డిని వైసీపీ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లెల రాజేష్ నాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు రత్నారెడ్డి కి శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు బేరింగ్ మౌలాలి, బీసీ సెల్ అధ్యక్షులు గుంజి వీరాంజనేయులు తదితర నాయకులు పాల్గొన్నారు.