నూతన సబ్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి అంబటి


సబ్ స్టేషన్ నిర్మాణంతో కొమెరపూడి గ్రామానికి త్రీఫేస్ తో కూడిన నిరంతర, నాణ్యమైన విద్యుత్ సదుపాయం మెరుగుపడుతుందని తద్వారా పారిశ్రామిక ప్రగతి మెరుగుపడేందుకు దోహదపడుతుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామములో రూ. 3కోట్ల నిధులతో నిర్మించిన సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు.