ఆర్టీసీ ప్రయాణికులకు ప్రోత్సాహక బహుమతులు


విజయనగరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోమవారం ఆర్టీసీ ప్రయాణికులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విజయనగరం డిపోల నుంచి సింహాచలం, ఆండ్ర, చీపురుపల్లి - మెరకముడిదం, విజయనగరం - జామి - ఎస్. కోట కు డిసెంబర్ 1నుంచి 15వ తేదీ వరకు ఆ మార్గాల్లో నడుపుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి గిఫ్ట్‌ స్కీంలో ఎంపికైనవారికి ప్రజా రవాణా అధికారి సి. హెచ్. అప్పలనారాయణ అందజేశారు. ప్రయాణికుల టికెట్స్ ఆధారంగా డ్రా తీశారు.