అలంపురంలో ఫిబ్రవరి 1వ తేదీన మెడికల్ క్యాంపు


 పెంటపాడు మండలం అలంపురం వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రులు ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కొలనువాడ పెదకృష్ణంరాజు తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎముకలు, కీళ్లు, చర్మ, ఊపిరితులు, చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు శిబిరంలో సేవలందిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.