డాక్టరేట్ పొందిన ప్రసాద్ ను అభినందించిన ప్రభుత్వ విప్


 ప్రముఖ సంగీత విద్వాంసులు పిప్పళ్ల ప్రసాద్ కు యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రధానం చేసిన సందర్బంగా సోమవారం నాడు తమ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఆధ్యాత్మిక భజనలు, సంకీర్తనలతో ఆధ్యాత్మిక చైతన్యం ప్రజలలో కల్పిస్తూ భక్తి ప్రపత్తులతో భగవదారాధన కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారన్నారు.