రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సోమవారం తణుకు మండలం మండపాక గ్రామంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు తమపై అంతులేని ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని, సీఎం జగన్ నాయకత్వంలో మరోసారి తాము అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.