గొల్లప్రోలు పట్టణంలో స్ధానిక ఆర్యవైశ్య కళ్యాణ మంటపం నందు బుధవారం ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సేవ వజ్ర, సేవా రత్న, సేవా మిత్రాలతో సన్మానించే వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్న నిర్వహించారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వంగాగీత హాజరై వాలంటీర్లకు నగదు బహుమతులను అందజేయడంతోపాటు, దృశ్యాలువాతో సన్మానించారు. వాలంటీర్ల సేవలు ఎనలేనివని కొనియాడారు.