ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యుల బతుకు ఛిద్రమవుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపినా..రానున్న ఆరునెలల్లో సుమారు 8 వేల మంది మృతి చెందే అవకాశం ఉందని అమెరికా, లండన్‌లకు చెందిన నిపుణులు వెల్లడించారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్ధృతమైతే.. గాయాలు మరిన్ని మరణాలకు దారితీస్తాయని ఆ నివేదిక వెల్లడించింది.