మరోసారి రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం..


 ఢిల్లీ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులతో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు మరోసారి ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టాయి. ముఖ్యంగా రైతులు తమ వాహనాలతో ఢిల్లీ సరిహద్దుకు చేరుకుని బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు రైతుల పైకి టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో మాస్క్‌లు పెట్టుకుని మరీ రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.