ఆయిల్ ఫెడ్ ఎం. డి సురేందర్, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి బుధవారం దమ్మపేట మండలం పట్వారీగూడెంలో నూతనంగా ఆయిల్ ఫాం మొక్కలు నాటిన క్షేత్రాలను సందర్శించి సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈసందర్భంగా ఎండి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా నియమించిన సిబ్బంది ఎల్లప్పుడూ రైతులకు చేరువలో ఉంటారని, ఎప్పటికప్పుడు తోటలను పరిశీలించి సాంకేతిక సలహాలు, సాగులో మెరుగైన యాజమాన్యం పద్దతులను వివరిస్తూ ఉంటారని పేర్కొన్నారు.