H5N1 వంటి ఏవీయన్ ఇన్‌ఫ్లూయేంజా వైరస్ కొన్ని పక్షులకు సోకుతుంది. దీన్నే బర్డ్ ఫ్లూ వైరస్ అని పిలుస్తారు. ఈ వైరస్ కారణంగా కోళ్లు, పక్షులు త్వరగా చనిపోతాయి. పక్షులతో వ్యాపారం చేసేవాళ్లు, కోళ్ల ఫారం నడిపేవారు ఎక్కువగా వాటితో గడపాల్సి వస్తుంది. అలాంటివారికి ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. అయితే ఈ వైరస్ కారణంగా మనుషులు మరణించే శాతం చాలా తక్కువ. బర్డ్ ఫ్లూ సోకిన మనుషుల నుంచి ఇతర మనుషులకు ఇది వ్యాపించదు.