కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం


 యూపీలోని మీరట్‌లో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంతో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.