ద్వారకాతిరుమల మండలం ఐఎస్. జగన్నాధపురం లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర హోంశాఖ మంత్రి గోపాలపురం నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ తానేటి యువత బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు హోంమంత్రి వనితకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వనిత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు