కేసులకు భయపడి సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ పై నోరు మెదపడంలేదు అని నారా లోకేశ్ అన్నారు. గాజువాకలోని యువగళం పాదయాత్రలో ఆయనకు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఐక్యవేదిక సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందించారు. లోకేశ్ మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి జగన్ రెడ్డి కమిషన్ల కోసం, ప్లాంట్ లో వాటాల కోసం ఆరాటపడడం అత్యంత దుర్మార్గం అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణను అంగీకరించబోమని అన్నారు.