ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టంగుటూరులో భార్యపై అనుమానంతో భర్త గొంతు కోసి హత్య చేశాడు. టంగుటూరు మండల పరిధిలోని పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీలోఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు బాబు కర్ణాటక రాష్ట్రంలో సముద్ర వేటకు వెళ్తుంటాడు. మృతురాలు సంతోషమ్మ స్థానికంగా ఓ రొయ్యల ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పని చేస్తున్నారు. కాగా వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.