ర్యాపిడో సేవలు వినియోగించుకున్న ఓ బెంగళూరు యువతికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడో బైక్ డ్రైవర్ సదరు యువతి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించాడు. టిన్ ఫ్యాక్టరీ నుంచి కోరమంగళకు వెళ్లేందుకు యువతి ర్యాపిడో బుక్ చేసుకుంది. దాంతో ఆమెను పిక్ చేసుకున్న డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. తన పర్సనల్ విషయాలు అడిగడంతో పాటు ఫోన్ కావాలని అడిగాడని యువతి చెప్పింది. ర్యాపిడోకు ఫిర్యాదు చేయగా.. సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంది.