గోదావరి జిల్లాల్లో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు జగన్‌ను కలిశారు. సీఎం జగన్‌ను ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండెం దొరబాబు, తెల్లం బాలరాజు, చిట్టిబాబు, ఎలీజాలు కలిశారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, మార్పులపై సీఎం జగన్ చర్చించారు.